
– పాడుబడ్డ సబ్ డివిజన్ ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం
నవతెలంగాణ – మద్నూర్
ప్రభుత్వపరంగా మద్నూర్ మండల కేంద్రంలో గల ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ కార్యాలయం మూడు సంవత్సరాల క్రితం ఇక్కడి నుండి బిచ్కుంద కు తరలిపోయింది. తరలిపోయిన ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా లీగల్గా వెళ్లిందా లేదా అధికారుల ఇష్ట రాజ్యాంగ ఇల్లీగల్ గా తరలించడం జరిగిందా అనే దానిపై మద్నూర్ ప్రజల్లో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవతెలంగాణ మంగళవారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని పరిశీలించగా ఇక్కడ ఉన్న కార్యాలయం ఎప్పుడూ తరలిపోయిందో ఏ విధంగా తరలించారు తెలియని పరిస్థితి. ఇక్కడి నుండి ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ కార్యాలయం 2020 సంవత్సరంలో తరలిపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని నవతెలంగాణ మంగళవారం నాడు ఆర్డబ్ల్యూఎస్ శాఖ డిప్యూటీ ఇంజనీర్ అరవింద్ కుమార్ కు ఫోన్ ద్వారా వివరణ కోరెందుకు ఎన్నిసార్లు ఫోన్ కాల్ చేసిన నవతెలంగాణ ఫోన్ కాల్ ను స్వీకరించకపోవడం గమనారం. మద్నూర్ పాత తాలూకా కేంద్రం మద్నూరులో మొదట నుండి ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ కార్యాలయం ఇక్కడే కొనసాగుతూ వస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల కాలంగా ఆ కార్యాలయం ఇక్కడ కనిపించకుండా తరలిపోవడం, ఆ కార్యాలయ బిల్డింగు ఎవరి ఆధీనంలో ఉందో ఎవరికి తెలియని పరిస్థితి. ఆ పాత బిల్డింగు పాడు బడింది. దానిని ఏ ఒక్కరు చూడకపోవడం వలన కుక్కలకు, పందులకు రాత్రి వేళల్లో ఇతరత్రా పనులకు అడ్డాగా మారిందని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మద్నూర్ పాత తాలూకా కేంద్రంలో కొనసాగే ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ కార్యాలయం ఇక్కడి నుండి బిచ్కుంద కు తరలిపోవడం అంతర్యం ఏమిటని, లీగల్ గా వెళ్లిందా, లేక ఇల్లీగల్ గా అధికారులు తరలించారా, మద్నూర్ నుండి తరలిపోయిన ఆర్డబ్ల్యూఎస్ శాఖ కార్యాలయం పై అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ చేపట్టి తరలిపోయిన కార్యాలయాన్ని మళ్లీ మద్నూర్ లోనే కొనసాగించేలా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని , అలాగే జుక్కల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన లక్ష్మి కాంతారావును విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్డబ్ల్యూ శాఖ వివరణ ఇవ్వకపోవడం, తరలిపోయిన ఆర్డబ్ల్యూ శాఖ లీగల్ గా కాకుండా ఇల్లీగల్ గా బిచ్కుందకు తరలించడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పనితీరు పట్ల స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేకంగా చొరవ చూపాలని మద్నూర్ మండల ప్రజలు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తున్నారు.