ప్రతి విద్యార్థికి జీరో పొదుపు ఖాతా ఇస్తాం

– ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కల్పించిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
ప్రతి విద్యార్థికి జీరో పొదుపు ఖాతా ఇస్తామని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కలి గొట్  బ్యాంక్ మేనేజర్ మంగళవారం అన్నారు. మండలంలోని చింతలూరు గ్రామంలో జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కలిగోట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత పైన మేనేజర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి జీరో పొదుపు ఖాతా ఇస్తామని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు బ్రాంచ్ మేనేజర్ కొలి ప్యాక్ సింగిల్ విండో చైర్మన్  నాగుల శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కోలి ప్యాక్ సింగిల్ విండో చైర్మన్ నాగుల శ్రీనివాస్, ప్రజలు ఉపాధ్యాయులు లచ్చన్న ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.