
నవతెలంగాణ-తొగుట
మండల కేంద్రమైన తొగుటలో బుధవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరియటించనున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర మంత్రితో కలిసి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ, వాటర్ ట్యాంక్, పాఠశాల డైనింగ్ హాల్, కస్తూర్భా నూతన పాఠశాల భవనం, రైతు వేదికలను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. అనంతరం మల్లన్న సాగర్ నుండి దుబ్బాక కాలువ కు సాగునీరు విడుదల చేయనున్నరని తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ గ్రామ, బూత్, యూత్, విద్యార్థి, సోషల్ మీడియా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.