సీతారాముల శోభాయాత్రలో ఉద్రిక్తత

నవ తెలంగాణ హత్నూర
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దౌల్తాబాద్‌లో ఉత్సవ విగ్రహాలతో సోమవారం సాయంత్రం ఊరేగిం చారు. దౌల్తాబాద్‌లోని పశువుల ఆస్పటల్‌ నుంచి శోభాయాత్ర వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ష్యూ విసిరాడు. అనుమానితిని ఇంటి వద్ద స్థానికులు ఆందోళన చేశారు. అనుమానితుడి పండ్ల దుకాణం తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీస్‌బలగాలను భారీ ఎత్తున మోహరించారు. ఆందోళనకారులు ఎంతకీ తగ్గకపోవడంతో ఎస్పీ రూపేష్‌ కుమార్‌, డీఎస్పీ పురుషోత్తంరెడ్డి వచ్చి నిందితుడిని అరెస్టు చేస్తామని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా దౌల్తాబాద్‌లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మంగళవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడికక్కడ పికెటింగ్‌ నిర్వహిస్తున్నారు.