జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

– రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా
– జర్నలిస్ట్‌ డైరీ ఆవిష్కరణ
నవతెలంగాణ-సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లాలోని వర్కింగ్‌ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. సంగారెడ్డి జిల్లా వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ రూపొందించిన 2024 నూతన డైరీని మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభు త్వం కట్టుబడి ఉందని, జర్నలిస్ట్‌ సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నదన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అర్హులైన జర్న లిస్టులకు త్వరలో ఇండ్ల స్థలాలు అందజేస్తామన్నారు. అనం తరం అసోసియేషన్‌ అధ్యక్షులు ఎం.సాయినాథ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వల్లూరి క్రాంతికి నూతన సంవత్సర డైరీను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జర్నలిస్ట్‌ డైరీలో ఎంతో విలువైన సమాచారం అందిం చారని, అందుకు అసోసియేషన్‌ సభ్యులకు అభినం దనలు తెలిపారు. జర్నలిస్టులు ప్రజోపయోగకరమైన అంశా లపై సూచనలు, సలహాలు చేయాలన్నారు. ఈ కార్యక్ర మంలో సంగారెడ్డి వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షు లు ఎం.సాయినాథ్‌, ప్రధాన కార్యదర్శి కష్ణ, కోశాధికారి నాగ భూషణం, అసోసియేషన్‌ సభ్యులు ఎర్ర వీరేందర్‌ గౌడ్‌, సునీల్‌, పుండరీకం, రాజేష్‌, ఆంజనేయులు, నర్సింలు, బక్కప్ప, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.