బాలికా మేలుకో.. చట్టాలు తెలుసుకో 

– ఆడపిల్లను పుట్టనిద్దాం.. బతకనిద్దాం..
– చదవనిద్దాం.. ఎదగనిద్దాం…
– ఆడపిల్ల దేశానికి గర్వకారణం…!!
– నేడు జాతీయ బాలికా దినోత్సవం
నవతెలంగాణ – డిండి 
జాతీయ బాలికా దినోత్సవం వేడుకలు డిండి మండలంలోని అన్ని అంగన్వాడి కేంద్రాలలో, ప్రైమరీ స్కూల్లో, హైస్కూలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్ వైజర్ కల్లు రేణుకారెడ్డి మాట్లాడుతూ…నిత్యం ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలపై దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయని, ఇంటా, బయటా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా లైంగిక వేధింపులు, దాడులు నిత్యకృత్యంగా తయారయాయన్నారు. స్త్రీలు మానసికంగా, శారీరకంగా అనేక రూపాల్లో వేధింపులకు గురవుతున్నారని, అటువంటి దాడులు, వేధింపుల నుంచి రక్షణ పొందేందుకు బాలికలు, మహిళలకు అండగా అనేక చట్టాలు అమల్లో ఉన్నాయని ఆమె అన్నారు. సమాజం లోని అసమానతలను తొలగించడానికి, సామాజిక సమతౌల్యాన్ని కాపాడటానికి, బాలికలను సంరక్షించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. వారికి రక్షణగా ఉన్న చట్టాలను సమర్థంగా వినియోగించు కోగలిగితే స్త్రీ శక్తిని మరే ఇతర శక్తీ అడ్డుకోలేదని, మహిళలకు రక్షణగా ఉన్న కొన్ని ప్రత్యేక చట్టాల గురించి జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మండలంలోని చెరుకుపల్లి హైస్కూల్లో, కేజీబీవీ స్కూల్లో బాలిక దినోత్సవ సందర్భంగా ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలు, పెయింటింగ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో హై స్కూలు హెడ్మాస్టర్లు పెంటావతి, అడపాల రాంరెడ్డి, ప్రిన్సిపాల్, టీచర్లు, అంగన్వాడీ టీచర్లు మంగమ్మ, సత్యవాణి, చంద్రకళ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.