ఇథనాల్ పరిశ్రమ పనుల అడ్డగింత..

– పరిశ్రమను రద్దు చేయాలని రాజీవ్ రహదారిపై గుగ్గీల్ల గ్రామస్తుల రాస్తారోకో
నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని గుగ్గీల్ల గ్రామ శివారులో నిర్వహించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ పనులను బుధవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. విద్యుత్ సరఫరా కోసం నిర్మించ తలపెట్టిన దిమ్మ నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకుని నిర్మాణ సామాగ్రిని ట్రాక్టర్ యందు తరలించుకుపోయారు. అనంతరం ఇథనాల్ పరిశ్రమ నిర్మాణ అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలనే డిమాండ్ తో మండల పరీధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామ స్టేజ్ వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులతో మాట్లాడి విరమింపజేశారు.