మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సేవలు చిరస్మరణీయం..

– వెయ్యి రోజులుగా నిత్య అన్నదానం
– మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి
నవతెలంగాణ-వేములవాడ : ఆకలితో ఆల్మట్టించే వారికి నిత్యం అన్నదానం చేస్తూ పేద, బడుగు బలహీన యాచకులకు ప్రతినిత్యం మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు చేస్తున్న కార్యక్రమం చిరస్మరణీయమని బుధవారం వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. గత వెయ్యి రోజులుగా నిత్య అన్నదానం చేస్తున్న చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని, యాచకులకు, పేదవారి ఆకలిని తీర్చాలని కరోనా టైం నుండి ఇప్పటి వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మై చారిటబుల్ ట్రస్ట్ వారిని మనస్ఫూర్తిగా అభినందించాల్సిన విషయమని కొనియాడారు. దాతల సహాయ సహకారంతో ఒక బాధ్యతగా సేవలందించడం గొప్ప విషయం ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం భగవంతుని సేవ చేసినట్లు అని అన్నారు. దాతల సహకారంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి,నిరుపేద కుటుంబాలకు మై చారిటబుల్ ట్రస్ట్ ద్వారా  ఆర్థిక సహాయం అందిస్తూ ఆ కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారని మై చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అని అన్నారు. సేవా కార్యక్రమాలను ఎప్పుడు ఇలాగే కొనసాగించాలని వీరికి మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధు మహేష్,తిరుమల్ గౌడ్, గొంగళ్ళ రవికుమార్,పొలాస రాజేందర్,ప్రతాప నటరాజ్,ప్రతాప సంతోష్,మహమ్మద్ అబ్దుల్ రఫీక్,కొప్పుల హానుమాన్,భస్మాంగి బస్వరాజు,తాళ్లపల్లి ప్రశాంత్,వొడ్యాల వేణు,కళా అశోక్,చల్లా సత్తయ్య,గొండ ప్రసాద్, వీరగొని ఆంజనేయులు,గుండర్స్ మాధవ్ , డాక్టర్ శోభారాణి,డాక్టర్ అక్షిత పాటు తదితరులు పాల్గొన్నారు.