కామారెడ్డి జిల్లా ఆటో యూనియన్ జేఏసీ ఎన్నిక

నవతెలంగాణ-భిక్కనూర్ : కామారెడ్డి జిల్లా ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడిగా బిక్కనూరు పట్టణానికి చెందిన సిద్ధ రాములుని నియమించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సిద్ధ రాములను మండల ఆటో డ్రైవర్లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.