
మండలంలోని పురాని పెట్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల కు ఉపాధ్యాయుడు బొడ్డు భరద్వాజ తమ సొంత ఖర్చులతో విద్యార్థులకు టై, బెల్ట్, బ్యాడ్జిలు ఐడి కార్డులు బహుకరించారు. వీటిని మండల విద్యాధికారి స్వామి చేతుల మీదుగా బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ తోట శంకర్, విద్యా కమిటీ చైర్మన్ రవీంద్ర వర్మ, వైస్ చైర్మన్ స్వామి, పి.ఆర్.టి.యు మండల అధ్యక్షుడు వాసుదేవ్, వీడీసీ సభ్యులు మరియు ఉపాధ్యాయులు రమేష్, శేఖర్, శ్రీనివాస్, రాధిక, స్రవంతి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.