
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్ : పెద్ద కోడప్ గల్ మండలంలోని అంజని గ్రామానికి చెందిన వ్యక్తి అక్రమంగా గంజాయి అమ్ముతున్నాడని విశ్వసనీయమైన సమాచారం మేరకు గురువారం నాడు గ్రామంలోని నర్మల హన్మండ్లు తండ్రి పేరు ఆగమయ్య అనే వ్యక్తి ఇంటిని సోదాచేయగా 800 గ్రాముల ఎండు గంజాయి దొరికిందని ఇంట్లో గంజాయి ఉండడం మరియు అమ్మడం ఎక్సైజ్ చట్టరీత్యా నేరం కావున ఇతని పై కేసు నమోదు చేసినట్లు ఎక్సేజ్ సి.ఐ సత్యనారాయణ తెలిపారు.మరియు ఇతన్ని కోర్టులో హాజరు పరచగా కోర్టు వారు ఇతన్ని నిజామాబాద్ జైలుకు పంపించడం జరిగింది.ఎవరైనా ఇటువంటి మాదక ద్రవ్యాలు గంజాయి, ఇతర డ్రగ్స్ కలిగి ఉన్నా వాడినా, అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మరియు ఇటువంటి మాదకద్రవ్యాల సమాచారం ఎవరికైనా తెలిసినచో మాకు తెలియపరచాలని వారి పేరు గోపియంగా ఉంచబడుతుందని తెలిపారు. ఈరైడ్స్ లో పాల్గొన్నవారు ఎస్సై అభిషేకర్ హెడ్ కానిస్టేబుల్ ఎల్లయ్య, కానిస్టేబుల్స్ పరశురాం, నవీన్ రెడ్డి ,శ్రీధర్ ,అనిత,ప్రేమలత లు పాల్గొన్నారు.