నవతెలంగాణ- వలిగొండ రూరల్ : గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నాతాళ్లగూడెంలో ఎమ్మెల్సీ సిడిపి నిధులు 13లక్షల 50 వేలతో నిర్మించిన కమ్యూనిటీ హాలు ప్రారంభం,జాలుకాల్వలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన 20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వం విస్మరించిందని, హామీలతోనే కాలం వెళ్లబుచ్చారని, నియోజక వర్గంలో సాగునీటి కాల్వలకు నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో పోచంపల్లి నుండి వలిగొండవరకు డబల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరుకు కృషి చేస్తానని, కరోనా సమయంలో గ్రామాలకు రద్దైన బస్సులను అన్ని గ్రామాలకు పునరుద్ధరిస్తామని, నియోజక వర్గంలోని అన్ని గ్రామాలను అన్నీ రంగాలలో అభివృద్ధి పర్చడంలో శక్తివంచన లేకుండా కృషిచేస్తానని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలలో ఇప్పటికి 2 గ్యారెంటీలను అమలు చేశామని,కొద్దీ రోజులలో మిగతా గ్యారెంటీలను అమలు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్, జెడ్పిటిసి వాకిటి పద్మా అనంత రెడ్డి, వైస్ ఎంపిపి బాథరాజు ఉమా బాల్ నర్సింహా, సర్పంచులు ఉలిపే మల్లెశం, మద్దెల సందీప్ , ఎంపీటీసీ మోటే నర్సింహా, పాశం సత్తి రెడ్డి, తుమ్మల యుగంధర్ రెడ్డి, గుర్రం లక్ష్మరెడ్డి, బోళ్ల శ్రీనివాస్, గరిసె రవి, బెలిదె నాగేశ్వర్, ఉద్దగిరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.