నవతెలంగాణ -పెదవూర : పెద్దవూర మండలంలోని తుమ్మచెట్టు ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న డివైన్ మెర్సి పాఠశాలలో విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించినటువంటి బోజనశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ రెవరెండ్ ఫాదర్ హెర్మన్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రెవరెండ్ ఫాదర్ బాస్టిన్ జేసురాజ్ హెచ్ జి ఎన్ విద్యావ్యవస్థ కౌన్సిలర్ బుధవారం ముఖ్యఅతిథిగా హాజరై ముస్తాబైన భోజనశాలను రెవరెండ్ ఫాదర్ హేర్మన్ రాజ్ తో కలిసి ప్రారంభించారు.ఈసందర్భంగా రెవరెండ్ ఫాదర్ బాస్టిన్ జేసురాజ్ మాట్లాడుతూ ఈ భోజనశాలను విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచనలిచ్చారు.పాఠశాలను అన్నిహంగులతో పాటు మౌలిక వసతులు, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ప్రతి పేదింటి బిడ్డ నాణ్యమైన విద్యను అభ్యసించడానికి పాఠశాలల్లో అన్ని విధాలా వసతులు కల్పించేందుకు ప్రవేశపెట్టిందన్నారు.అనంతరం విద్యార్థులతో కలిసి నృత్యం చేసి విద్యార్థులకు సంతోషాన్ని కల్పించారు.విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.పాఠశాలలో సాంస్కృతిక, సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు షెడ్డు నిర్మించేందుకు అదనంగా హామీ ఇచ్చారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను డివైన్ మెర్సీ పాఠశాలలో చేర్పించాలని కోరారు.ఈ కార్యక్రమానికి రెవరెండ్ ఫాదర్ అలెగ్జాండర్, హెచ్జి ఎన్ మిషన్ కౌన్సిలర్,రెవరెండ్. ఫాదర్ సవరిముత్తు, హెచ్ జి ఎన్ ప్రొవిన్సియల్ కోశాధికారి రెవరెండ్ ఫాదర్ జోసెఫ్, హెచ్ జి ఎన్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు,మిస్టర్ విల్సన్ కాంట్రాక్టర్, డ్రైవర్లు,వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.