
నవతెలంగాణ-మద్నూర్ : అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటోలకు గిరాకులు కరువయ్యాయి మద్నూర్ పాత బస్టాండు సమీపంలో ప్రయాణికుల కోసం పెద్ద సంఖ్యలో ఆటోలు స్థిరపడి ఉన్న దృశ్యాన్ని నవ తెలంగాణ చిత్రీకరించింది ఉచిత బస్సు సౌకర్యంతో ఆటోలకు ప్రయాణికులు ఎక్కడం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గంటల తరబడి ప్రయాణికుల కోసం ఎదురుచూస్తున్న బస్సులో ఎక్కుతున్నారు కానీ ఆటోలో రావడంలేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు రోజురోజుకు ఆటో డ్రైవర్ల పరిస్థితి ప్రయాణికుల కరువుతో ఆందోళనకు గురి అవుతున్నారు