– వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా విరాట్
దుబాయ్: భారత సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు. 2023 ఏడాదిలో 1377 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. ప్రపంచకప్‌లోనే ఏకంగా 765 పరుగులు సాధించాడు. ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లి ఐసీసీ 2023 వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. ఇక ఐసీసీ అవార్డుల్లో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ హవా నడిచింది. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన పాట్ కమిన్స్.. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ జట్టు సారథ్యం సైతం దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ నటాలీ సీవర్ ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. భారత స్టార్ సూర్యకుమార్ యాదవ్.. ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే.