8 మిల్లీమీటర్ల జాతీయ జెండా

– చాక్‌పీస్‌పై వందేమాతరం గీతం
నవతెలంగాణ-కోదాడరూరల్‌
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకా రుడు తమలపాకుల సైదులు 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సూది రంధ్రంలో ఇమిడిపోయే అతి చిన్న సైజు 8 మిల్లీమీటర్ల ఎత్తు గల జాతీయ జెండాను తయారు చేశాడు. అంతేకాకుండా 1.5 సెంటీమీటర్‌ పొడవు,10 మిల్లీమీటర్ల వెడల్పు గల చాక్‌ పీస్‌పై వందేమాతరం గీతాన్ని రాశాడు. గతంలో బియ్యం గింజపై జాతీయ జెండా, ఆవగింజపై జాతీయ జెండా, నువ్వుల గింజపై జాతీయ జెండాను తయారు చేశాడు. దీంతో అనేక పురస్కారాలు అందుకున్నాడు.