
మండలంలోని రైతు వేదికలలో క్లస్టర్ ఏఈవో ల ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా శుక్రవారం నాడు మండలంలోని నాగల్ గావ్ , జుక్కల్, హంగర్గ, ఖండేభల్లూర్, పెద్ద ఎడ్గి, డోన్గాం, క్లస్టర్ ఏఈవోలు రైతులతో కలిసి జెండావిష్కరణ చేసారు. గ్రామాలలో రైతులు భారీగా తరలి రావడంతో రైతు వేదికలు కళా వచ్చి రైతు పండుగల ప్రాంగణమంతా మారింది. కార్యక్రమంలో జీపీ నాగల్ గావ్ జేపిఎస్ హరీష్, ఏఈవోలు నాగల్ గావ్ రాజామాల, జుక్కల్ రాజ్యలక్ష్మీ, పెద్దగుల్ల శ్వేతా, పెద్దఎడ్గి సులోచన, హంగర్గ విశాల్, డోన్గాం రాజహిత, ఆయా గ్రామాల గ్రామపెద్దలు, సర్పంచులు, మహిళ కూలీ రైతులు, నాగల్ గావ్ ఏఫ్ఏ బాబు, మాజీసర్పంచ్ అనీల్, తది తరులు పాల్గోన్నారు.