
గణతంత్ర దినోత్సవం 26 జనవరి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాలీ, ఆటో యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఫిబ్రవరి 16న జరగబోయే సమ్మెను విజయవంతం చేయాలని, కరపత్రాలు ఇంటింటికి పంపిణీ చేసి సంతకాల సేకరణ చేయాలని కార్మికులందరూ ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉండాలని, ఆ రోజుల్లో బ్రిటిష్ తెల్లదొరల నుండి దేశాన్ని రక్షించిన దాంట్లో మొదటి పాత్ర కార్మికులదే ఉన్నది. కార్మికులతో పాటు అనేకమంది మేధావులు, కర్షకులు, విద్యార్థులు, అనేకమంది పోరాటాల అనంతరం దేశానికి స్వతంత్రం రావడం జరిగింది. స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా దేశంలో పేదరికం విద్య, ఉపాధి దొరకకా, దేశ ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. మనమందరం దేశాన్ని గౌరవిస్తూ మనకు రావాల్సిన హక్కులను మనం పోరాట రూపంలో పోరాడి సాధించుకోవాలి. కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పరేటు పరం చేస్తుంది ముద్దు ముద్దు పేర్లతో అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% వాటా ఖజానా ను అమ్ముతున్నది. కార్మికుల హక్కులను కాల రాస్తుంది కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ లను తీసుకొచ్చింది వెంటనే వాటిని రద్దు చేయాలి కనీస వేతనం 26వేల రూపాయల చట్టాన్ని అమలు చేయాలి. భారత రాజ్యాంగాన్ని అందులో పొందుపరిచిన లౌకికవాదాన్ని తారు మారు చేస్తూ హిందూ రాజస్థాపన లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ తన యజెండాను ముందుకు తీసుకొస్తుంది నిరుద్యోగం ధరల పెరుగుదల పేదరికం ఆకలి మొదలైన కీలక అంశాలను ప్రజల నుండి మల్చడానికి బేధాలు కేంద్ర ప్రభుత్వం రెచ్చగొడుతుంది కాబట్టి శ్రామికులమంతా ఏకమై ఫిబ్రవరి 16న జరుగుతున్న కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బందులో కార్మికులందరూ పాల్గొని సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా సభను ఉద్దేశించి ఆమె మాట్లాడడం జరిగింది .ఈ కార్యక్రమంలో సుధాకర్, ఎస్ కే హైమద్, ఎస్ కే జావీద్, నవీన్, దశరథ్ ,మోహన్, హైమద్ పాషా చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.