
నవతెలంగాణ -కాటారం
మండలంలోని ZPHS సుంద రాజ్ పేట్ లో శుక్రవారం రోజున 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. HM.S మహేందర్ రెడ్డిగారు జండా ఆవిష్కరణ జరిపించారు. పిల్లలు భవిష్యత్తు బాగుండాలని పాఠశాలలోని తెలుగు పండిట్ శ్రీ గజ్జి భాస్కర్ ప్రత్యేక చొరవతో ఎడ్యుకేషన్ TO ALLఅనే కాన్సెప్ట్ తో ఫౌండేషన్, స్వచ్చంద సేవాసంస్థ ద్వారా మారుమూల ప్రాంతమైన సుందరాజ్ పేట్ పాఠశాల లో పేద విద్యార్థులకు సుమారు Rs.25000/విలువైన, సామాగ్రి, T,SHIRTS,షూస్, సాక్స్, ఎగ్జామ్స్ ప్యాడ్స్ ఎర్రగుంట Ramdass, ఎంకన్న, ఫౌండేషన్ మెంబెర్స్ ఐన దాతలచే పంపిణి చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల స్టాఫ్, మరియు గ్రామ సర్పంచ్, కార్యదర్శి, గ్రామ పెద్దలు, యూత్మెంబెర్స్, విద్యార్ థులు పాల్గొన్నారు.