మండల కేంద్రంలోని కృష్ణవేణి హై స్కూల్ లో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు గ్రామంలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాలలో జాతీయ పతాకం ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులు ప్రదానం చేశారు . ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు కే .భానుచందర్, ఏ .లక్ష్మణ్ ,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.