రెంజల్ మండలంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు..

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండలంలో 75వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శంకర్, గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ ల మండల అధ్యక్షులు ఎమ్మెస్ రమేష్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వినయ్ కుమార్, రెంజల్ సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ మొహీనుద్దీన్, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రామచందర్, పోలీస్ స్టేషన్లో ఎస్సై ఉదయ్ కుమార్, ఐకెపి కార్యాలయంలో ఏపి ఎం భాస్కర్, 17 గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచులు జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజని కిషోర్, జడ్పిటిసి మేక విజయ సంతోష్, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, సూపర్డెంట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు..