ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

 నవతెలంగాణ – చివ్వేంల
75వ  గణతంత్ర దీనోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోరాట యోధులు,  జాతీయ నాయకులను,  అమరవీరులను గుర్తు చేసుకొంటూ మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో , పాఠశాలలో  గ్రామపంచాయతీ లలో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలనుఘనంగా నిర్వహించారు.  శుక్రవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ రంగారావు, మండల ప్రజా పరిషత్  కార్యాలయంలో ఎంపీడీఓ లక్ష్మి,  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సి ఈ ఓ జూలకంటి శ్యాంసుందర్ రెడ్డి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరంరాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు  నివాళులర్పించారు… పలు కార్యక్రమాల్లో  ఎంపీపీ ధారావత్ కుమారి బాబు నాయక్, ఎంపీ ఓ గోపి, మండల వ్యవసాయ అధికారి ఆశకుమారి, డిప్యూటీ తహసిల్దార్ ఝాన్సీ, ఏపీవో నాగయ్య, పంచాయతీరాజ్ ఏఈ లింగా నాయక్, ఏపీఎం రాంబాబు, పిఎసిఎస్ వైస్ చైర్మన్  సైదులు, ఆర్ ఐ లు రామారావు, వెంకట్ రెడ్డి, ఎల్కకృష్ణారెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, పిఎసిఎస్ డైరెక్టర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.