మండలంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవాన్ని ఆయా గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రోజా, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుధాకర్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సవితారెడ్డి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, ప్రధానోపాధ్యాయులు, యువజన సంఘాలు మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. ఆయా పాఠశాలలో విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. బట్టు తాండ, స్కూల్ తాండ లలో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి పాల్గొని, విద్యార్థులకు బహుమతులను అందజేశారు.