చౌటుప్పల్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలంలో 75 వ గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ కేఎంవి జగన్నాధ రావు, ఎంపీడీవో కార్యాలయంలో బి.సందీప్ కుమార్, ప్యాక్ కార్యాలయంలో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, రాచకొండ పోలీస్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ వై. మొగులయ్య, చౌటుప్పల్ పట్టణ ఠాణాలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.దేవేందర్, పట్టణ ట్రాఫిక్ కార్యాలయంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సైదులు, మండల వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు జాతీయ జెండాలను ఆవిష్కరింపజేశారు.