విద్యార్థులకు ప్లేట్ల వితరణ

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని తొర్లికొండ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు వితరణ చేసినట్టు ప్రధానోపాధ్యాయుడు జంగం అశోక్ తెలిపారు. తొర్లికొండ హైస్కూల్లో సబార్డినేట్ గా పనిచేస్తున్న చిట్యాగల శేఖర్ తండ్రి చిట్యాగల భూమన్న జ్ఞాపకార్థం ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు వితరణ చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు అశోక్, సంజీవ్ కుమార్ గౌతమి లలిత, చిట్యాల శేఖర్, తదితరులు ఉన్నారు.