
ఈ నెల 28న ఆదివారం నాడు మద్నూర్, డోంగ్లి, మండలాల. అంగన్వాడి, ఆశ, గ్రామపంచాయతీ. పాఠశాలల మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల సమన్వయ కమిటీ సమావేశం ఉదయం. 11:30 నిమిషాలకు మేనూర్ ప్రభుత్వ పాఠశాలలో సమావేశము కలదు. ఈ సమావేశానికి సీఐటీయూ కామారెడ్డి జిల్లా కన్వీనర్ కె చంద్రశేఖర్ హాజరవుతున్నారు. కావున మద్నూర్, డోంగ్లి, మండలాల కార్మికులందరూ తప్పకుండా హాజరు కావలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులంతా హాజరై సమన్వయ కమిటీ సమావేశం విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జుక్కల్ నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ గొండ ఒక ప్రకటనలో కోరారు.