ఆర్థిక సాయం అందజేత..

నవతెలంగాణ- యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మున్సిపల్ మూడవ వార్డు శనివారం, ఇటీవలే మరణించిన ఒగ్గు సుదర్శన్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరి పరామర్శించి, 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బూడిద వెంకటేష్, బూడిద కుమార్, బూడిద ప్రశాంత్, బూడిద గణేష్, పులిగిల్ల శివ, మోత్కుపల్లి రాము, ఒగ్గు ఆనందం తదితరులు పాల్గొన్నారు.