కాంగ్రెస్ పార్టీలో చేరికలు

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్వర్యంలో నవిపెట్ మండలం మట్టయ్య ఫారం సర్పంచ్ వకలపుడి రాము,అబ్బపుర్ యం సర్పంచ్ యస్.శ్రీనివాస్,ఉపసర్పంచ్ భూమయ్య వీరితో పాటు నాగరాజు, మాట్టయ్య ఫారం పి.కృష్ణ రావు,శ్రీనివాస్,కృష్ణ తదితరులు మాజీ మంత్రివర్యులు,ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తో కలిసి పనిచేయాలని వారితో ప్రయనించలని కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్,ఏడపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పులి శ్రీనివాస్ రావు,రెంజల్ మండల అధ్యక్షులు మోబీన్ ఖాన్,మాజీ వైస్ ఎంపీపీ గోవర్దన్ రెడ్డి, తాడ్బిలోలి సాయిరెడ్డి పాల్గొన్నారు.