– ప్రైమరీ స్కూల్ జపాల్ ప్రధానోపాధ్యాయులు: ఎస్ కే.జహీర్ అజాద్
నవతెలంగాణ-మంచాల
నో బ్యాక్ డే సందర్భంగా శనివారం మండల పరిధిలోని ప్రైమరీ స్కూల్ జపాల్ విద్యార్థులను క్షేత్ర పరిశీలనకు తీసుకెళ్లినట్టు ప్రధానోపాధ్యాయులు ఎస్‌కే.జహీర్ అజాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షేత్ర పరిశీలనలో భాగంగా విద్యార్థులు రైతులను వివిధ ప్రశ్నలు అడిగి చాల విషయాలను తెలుసుకోవడం జరిగిందని ముఖ్యంగా డ్రిప్ సిస్టమ్, మల్చింగ్ కవర్, పందిరి కూరగాయల సాగు, మేష్ వాడకం, వీడర్ వాడకం, వ్యవసాయంలో ఆధునిక పరికరాలు వాడకం గురించి తెలుసుకోవడం జరిగిందని, కుండల తయారీలో ఆధునిక పరికరాలు ఎలా వాడుతున్నారో తెలుసుకున్నట్టు తెలిపారు.