డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిం చిన చిత్రం ‘హను-మాన్’. తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై పతాకంపై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాటిట్యూడ్ మీట్‌ని నిర్వహించింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ,’ఈ సినిమాతో తేజ సూపర్ హీరో అయ్యాడు. రవితేజ ‘హనుమాన్’లో భాగం అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు. అలాగే ఎన్నో క్లోజింగ్ థియేటర్స్ ఈ సినిమా వలన ఓపెన్ అయ్యాయని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. మూడో వారంలో కూడా హౌస్ ఫుల్ బోర్డ్ చూడటం ఒక ఫిలిం మేకర్‌కి గొప్ప తప్తిని ఇస్తుంది. మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్‌కి థ్యాంక్స్. హనుమాన్‌కి సంబంధించి చాలా వేడుకలు ఉండబోతున్నాయి. ప్రేక్షకులు హనుమాన్ సినిమాని ఒక దేవాలయంగా ఫీలౌతున్నారు. ప్రేక్షకులకు తెలియకుండానే సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ అయోధ్య రామమందిరానికి ఐదు రూపాయిలు డొనేట్ చేస్తున్నారు. ఇది నిర్మాత నిరంజన్ వలనే సాధ్యపడింది. అయోధ్యతో పాటు మిగతా ఆలయాలకు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఇంకా చాలా రోజులు ఆడుతుంది. ప్రేక్షకులకు ఈ విజయాన్ని ఆపాదిస్తున్నాను. మీ అందరి ఋణం జై హనుమాన్‌తో తీర్చుకోబోతున్నాను’ అని అన్నారు.
‘ఈ సినిమా కోసం టీం అంతా సమిష్టిగా కషి చేశారు. అన్నీ విభాగాలు చాలా కష్టపడి అద్భుతమైన అవుట్‌ఫుట్ ఇచ్చారు. నిర్మాత నిరంజన్ ఈ సినిమా వెనుక కొండంత అండగా నిలబడ్డారు. మమ్మల్ని బలంగా నమ్మారు. సినిమాని ఇంత అద్భుతంగా విడుదల చేసిన పంపిణీదారులందరికీ ధన్యవాదాలు. సినిమాని అద్భుతంగా ప్రోత్సహించిన ప్రేక్షకులకు పాధాబివందనం’ అని హీరో తేజ సజ్జా చెప్పారు. హీరోయిన్ అమత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, నిర్మాత నిరంజన్ రెడ్డి, నిర్మాత చైతన్య తదితరులు ఈ చిత్ర విజయం గురించి మరిన్ని విశేషాలను తెలియజేశారు.