
కొబ్బరి వృక్ష మిత్రుల శిక్షణా కార్యక్రమం లో బాగంగా ఐదో రోజు ఆదివారం శిక్షణార్హులు అందరినీ ఉద్యానవన పరిశోధన స్థానం,కొబ్బరి విత్తన కేంద్రంలో క్షేత్ర దర్శన నిర్వహించారు. ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి.విజయకృష్ణ కొబ్బరి నర్సరీ యాజమాన్య పద్ధతులు వివరించారు.కొబ్బరి విత్తనోత్పత్తి కేంద్రం అధికారి,ఉద్యాన శాఖ మండల అధికారి జే.కిషోర్కొబ్బరి విత్తనోత్పత్తి లో యాజమాన్యం పద్దతులను,నర్సరీ నిర్వహణ, ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసారు.వ్యవసాయ విద్యను అభ్యసించే నాలుగో సంవత్సరం విద్యార్ధులు ఎ.ఇ.ఎల్.పి కమర్షియల్ హార్టికల్చర్ విభాగం విద్యార్థులు కూడా క్షేత్ర దర్శన లో పాల్గొన్నారు.వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం,అధ్యాపకులు కే.శిరీష ఈ క్షేత్ర దర్శన ను సమన్వయ పరిచారు.ఈ కార్యక్రమంలో మాష్టర్ ట్రైనీ స్ రఘు,శ్రీను పాల్గొన్నారు.