చలి మంటలు

పుష్యమి ఇంట్లో చందమామ ఆగమనం
చలి మంటలతో జనం ఆగం..
ఒంట్లో నలతతో ఊపిరి ఆడక
రగ్గు దుప్పటిలో మనిషి జీవనం అయోమయం
ఉత్తరం దక్షిణం మీద యుద్ధం చేస్తుందేమో..
హిమాగిరులు శంఖారావం పూరించాయో..
పడమటి సంధ్య కాలాన్ని అడ్డుకుంటుందేమో!
రుతురాగాల తిరోగమానం
ప్రకృతి విధ్వంసంకి బహుమతి కాబోలు
పర్యావరణ పరిరక్షణ గాలికొదిలి
కాలుష్యం కోరలో చిక్కిన అభివృద్ధి ఫలాలు
మనిషికి ఊరటం ఇవ్వడం లేదేమో!
పగ బట్టినట్లు కాలం కూడా రాజకీయ క్రీడ నేర్చుకుందేమో?
నేను అనే అహంభావానికి
గుణపాఠం చెప్పడానికి
ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు చేస్తున్న..
స్వార్థం మనిషిని విడవలేక
అధ: పాతాళనికి తొక్కేస్తున్నా ఇంకా
మారని ఈ మనిషికి ఇప్పుడన్నా
ఈ హేమంతం చిగురుల చిలిపి తనపు సహవాసం ఓదార్పు నిస్తుందని..
భోగిమంటల అగ్నిహోత్రం చలి పులి నుండి రక్షణ కల్పిస్తుందని..
కుల మతాలకతీతంగా మానవ సమాజం పునర్నిర్మాణన్నికి
జాతి గొప్ప విశిష్టతను చాటడానికి
మకర సంక్రాంతి పండుగ అలంబాన కావాలి
ప్రతి ఎద లోగిలిలో ఆనందం
గాలి పటాలయి ఎగరాలి
పచ్చని పాడి పంటలతో భూమి
పొద్దు పొడుపు పువ్వులే నవ్వలే.!
ఇంటింటా రంగుల హరివిల్లు
రేపటి సమైక్య భావనకు నాంది పలకాలి..
మనిషి మనస్సులో నాటుకున్న
కుళ్ళు కుతంత్రాలు మాయమై
ప్రేమ సుధలు కురియాలి.!
నిత్య వసంత రాగమై మురిసి పోవాలి.!!
– రవీందర్‌ కొండా, 9848408612