దర్శకుడు శ్రీను వైట్ల ప్రస్తుతం హీరో గోపీచంద్‌తో ఓ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు ఇటలీలో ఒక షెడ్యూల్, గోవాలో మరొక షెడ్యూల్ పూర్తి చేశారు. లేటెస్ట్‌గా ఆదివారం గోపీచంద్, ఇతర ప్రముఖ తారాగణంతో హిమాలయాలలోని కొన్ని అద్భుతమైన ప్రదేశాలలో కీలకమైన, లెంగ్తీ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ ప్రాజెక్ట్‌తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన యాక్టర్స్‌కు డిఫరెంట్ మేకోవర్లు ఇవ్వడంలో పేరుపొందిన శ్రీను వైట్ల గోపీచంద్‌ని ఈ సినిమాలో సరికొత్తగా చూపించబోతున్నారు. ఇందులో యాక్షన్‌తో పాటు శ్రీనువైట్ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. శ్రీనువైట్ల తెరకెక్కించిన పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న రచయిత గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్.