చాంపియన్‌ సినర్‌

చాంపియన్‌ సినర్‌– ఫైనల్లో మెద్వదేవ్‌కు నిరాశ
– ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌
మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు కొత్త చాంపియన్‌ వచ్చాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఐదు సెట్ల పోరాటంలో పైచేయి సాధించిన జానిక్‌ సినర్‌.. మెన్స్‌ సింగిల్స్‌ విజేతగా నిలిచాడు. మూడో సీడ్‌ రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వదేవ్‌కు ముచ్చటగా మూడోసారి మెల్‌బోర్న్‌ ఫైనల్లో నిరాశే ఎదురైంది. టైటిల్‌ పోరులో 6-3, 6-3తో వరుసగా తొలి రెండు సెట్లు నెగ్గిన మెద్వదేవ్‌ టైటిల్‌కు సెట్‌ దూరంలో నిలిచాడు. చావోరేవో తేల్చుకోల్సిన తరుణంలో చెలరేగిన సినర్‌ వరుసగా చివరి మూడు సెట్లను 6-4, 6-4, 6-3తో సొంతం చేసుకున్నాడు. ఇటలీ స్టార్‌ సినర్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. సినర్‌ 14 ఏస్‌లు, నాలుగు బ్రేక్‌ పాయింట్లతో మెరువగా.. మెద్వదేవ్‌ 4 నాలుగు బ్రేక్‌ పాయింట్లు, 11 ఏస్‌లు కొట్టాడు. పాయింట్ల పరంగా 142-141తో సినర్‌ పైచేయి సాధించాడు.