పదోన్నతులకు టెట్‌ అర్హతపై ప్రభుత్వం పునరాలోచించాలి

”ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది” విద్యా హక్కు చట్టం ఉపాధ్యాయ పదోన్నతులకు టెట్‌ తప్పనిసరి చేయటం.విద్యా హక్కు చట్టం, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌ సి టి ఈ)నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ విష యంపై టెట్లో అర్హత సాధించిన కొంతమంది ఉపా ధ్యాయులు కోర్టును ఆశ్రయించడంతో పదోన్న తుల ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుతం పదో న్నతి పొందాలంటే టెట్‌ ఉత్తీర్ణత సాధించాలని విద్యాశాఖ నిర్ణయించడంతో వేలాది మంది ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడో 20, 25 సంవ త్సరాల క్రితం పాఠశాల ఉపాధ్యాయులుగా నియమించబడ్డ వారు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాలంటే ఈ వయసులో టెట్‌ రాసి ఉత్తీర్ణత సాధించడం సాధ్యమౌతుందా?
ప్రభుత్వ పాఠశాలలపై తీవ్ర ప్రభావం
ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే టెట్‌లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలనే విద్యా శాఖ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 19వేల ఉపాధ్యాయ పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. కేవలం 2012 డి ఎస్‌ సి,2017 టిఆర్‌టి ద్వారా నియామకమైన సు మారు 20వేల మంది ఉపాధ్యాయులకు మాత్ర మే టెట్‌ అర్హత ఉంది. ఇప్పటికే సుమారు పది వేల మంది ఉపాధ్యాయులు టెట్‌ పాసై ఉండ వచ్చు. మొత్తంగా 30 వేల మంది ఉపాధ్యా యులు మాత్రమే టెట్‌లో అర్హత కలిగి ఉన్నా రు. సుమారు ఒక లక్ష మంది ఉపాధ్యాయులు టెట్‌ పరీక్ష రాయ లేదు.టెట్‌ అర్హత నేపథ్యంలో పదోన్నతుల ప్రక్రియ వాయిదా వేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్ర మౌతుంది. దాని వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు నష్టపోతారు. అలా అని టెట్‌ అర్హత గల వారితోనే పదోన్నతుల ప్రక్రియ నిర్వహిస్తే సీనియర్‌ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయి, సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తూ పదోన్న తులు లేకుండానే రిటైర్డ్‌ అవుతారు.
విద్యాశాఖ తాత్సర్యం
ప్రధానోపాధ్యాయుల, ఇతర శాఖలలో పదోన్నతుల కోసం జీఓటి, ఈఓటి లాంటి శాఖాపరమైన పరీక్షలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు.అదే మాదిరి విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చినప్పటి(2010) నుంచే ఉపాధ్యాయ పదోన్నతులకు కూడా టెట్‌ తప్పనీసరి చేస్తూ అమలు చేసి ఉంటే ప్రారంభంలోనే ఉపాధ్యాయులు దానిపై దృష్టి పెట్టి పరీక్షలు రాసి పాస్‌ అయ్యి ఉండేవారు.2010లోనే ఎన్‌ సి టి ఇ ఈ నిబంధనలు అమలులోకి తెచ్చింది. 2012,2017 ఉపాధ్యాయ నియామకా ల్లో ఈ నిబంధనలు అమలు చేసిన విద్యాశాఖ పదోన్నతిలో కూడా ఎందుకు అమలు చేయలేదు?. విద్యాహక్కు చట్టం ప్రకారం పదోన్నతిలో టెట్‌ తప్పనిసరి కావడంతో 2015 లోపు ఉత్తీర్ణులు కావాలని కేంద్రం గడువు ఇచ్చింది. అయినా ఆ దిశగా విద్యాశాఖ చర్యలు ఎందుకు తీసుకోలేదు?. కేంద్రం మరొక మారు ఐదు సంవత్సరాల గడువు పెంచుతూ 2019 వరకు ఉత్తీ ర్ణులు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయిన అప్పుడెం దుకు విద్యా శాఖ అమలు చేయలేదు?.
ఎన్‌ సి టి ఇ గెజిట్‌ నోటిఫికేషన్‌ 23-8-2010 ఫేరా 4 ప్రకారం అప్పటికే ఇన్‌ సర్వీస్‌లో ఉన్న ఉపా ధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో మిన హాయింపు ఇవ్వవచ్చు+ఉ వీూ అశీ 36 స్‌ 23-12-2015 ప్రకారం ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వబడింది.కానీ ఇప్పుడు టెట్‌ ఉంటేనే పదోన్నతులకు అర్హులు అని నిర్ణయించడం ఎంతవరకు సమంజసం. గత తొమ్మిది సంవత్సరా లుగా పదోన్నతులు లేక నిరాశతో ఉన్న ఉపాధ్యా యులకు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైన ఈ సందర్భంగా టెట్‌ తప్పనిసరి అని నిర్ణయిస్తే వెం టనే వారు ఎలా అర్హత సాధిస్తారు?.ఈ చర్య వల్ల సుమారు దశాబ్ద కాలంగా పదోన్నతులకోసం ఎదురు చూస్తున్న వేలాది మంది ఉపాధ్యాయుల ఆశల్లో నీళ్లు చల్లినట్లు కాదా? 44 సంవత్సరాలు దాటిన వారికి టెట్‌ రాసే అర్హత లేదు. కాబట్టి సుమారు 20,25 సంవత్సరాలు ఉపాధ్యాయ వత్తిలో ఉన్న ఉపా ధ్యాయులకు వారి బోధన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని,ఈ వయసులో వారికి ఉన్న బరువు, బాధ్యతలను దృష్టిలో ఉంచు కొని 45 సంవత్సరాలు దాటిన ఉపాధ్యాయులకు పదోన్నతిలో టెట్‌ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి.
ప్రత్యేక టెట్‌ అవసరం
ప్రస్తుతం బిఈడి అభ్యర్థులు వ్రాస్తున్న టెట్‌లో ఉపాధ్యా యులు అర్హత సాధించడం కొంత కష్టం. ఎందుకంటే ఉపాధ్యా యులు పదోన్నతి పొందే సబ్జెక్టులో తప్పనిసరిగా డిగ్రీ లేదా తత్సంబంధ అర్హత సాధించి ఉంటారు. కొందరైతే పీజీ అర్హత సా ధించి ఉంటారు. టెట్‌లో ఆ సబ్జెక్టులో ఎంత కఠినమైన ప్రశ్నలు అడిగిన సమాధానాలు వ్రాయగలరు. కాబట్టి సులభంగానే టెట్‌ పాస్‌ కాగలరు. కానీ బీఈడీ అభ్యర్థులు వ్రాస్తున్న టెట్‌లో అడుగుతున్న ప్రశ్నలు విచిత్రంగా ఉన్నాయి. సాంఘిక శాస్త్ర పదోన్నతి కోసం అర్హత ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌లో తెలుగు పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. జీవశాస్త్ర పదోన్నతి కోసం అర్హత ఉన్న ఉపా ధ్యాయులు టెట్లో గణిత సంబంధ ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది.గణిత శాస్త్ర పదో న్నతి కోసం అర్హత ఉన్న ఉపాధ్యాయుడు టెట్లో జీవ శాస్త్ర సంబంధ ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉం టుంది. 20,25 సంవత్సరాల సర్వీస్‌ ఉన్న సీనియర్‌ ఉపాధ్యాయులు ఇప్పుడు తమ సబ్జెక్ట్‌ కాకుండా ఇతర సబ్జెక్ట్‌ను ఎలా ప్రిపేర్‌ కాగలరు.టెట్‌ అర్హత లేకుండా పదో న్నతి ఇవ్వని పక్షంలో ఇన్‌ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయు లకు పదోన్నతి కోసం ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి. సాధార ణంగా నిర్వహించే టెట్‌లా కాకుండా ఇన్‌ సర్వీస్‌ ఉపా ధ్యాయులకు వారు బోధించబోయే సబ్జెక్టునీ, బోధన అను భవాన్ని, బోధన మెలకువలను పరీక్షించే విధంగా సులభతరంగా ఉండేటట్లు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి. ఇంకా అవసరమైతే జీ ఓ టి,ఈ ఓ టి మాదిరి చూసి రాసే పద్ధతిలో టెట్‌ నిర్వహించాలి.
పదోన్నతుల ప్రక్రియ కొనసాగించాలి
పదోన్నతులకు టెట్‌ తప్పనిసరి అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునర్‌ సమీక్షించాలి. కోర్టు తీర్పుల వలన మధ్యలో నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియను కోర్టు ప్రత్యేక అనుమతితో నిర్వహించుటకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కోర్టు అనుమతి ఇవ్వని పక్షంలో కనీసం పదోన్నతులు పొందిన తరువాత మూడు సంవ త్సరాల లోపు టెట్‌ పాస్‌ కావాలనే షరతుపై పదోన్న తుల ప్రక్రియ కొనసాగించాలి.ఇప్పటికే రాష్ట్రంలో నిరు ద్యోగ సమస్య తీవ్ర రూపంలో ఉన్నందున పదోన్న తుల తర్వాతనే కొత్త డీఎస్సీ నిర్వహిస్తే మెగా డీఎస్సీ కి సాధ్యం అవుతుంది. కాబట్టి 2010 కాన్న ముందు ఉపా ధ్యాయులుగా నియామకం అయిన వారికి టెట్‌ నిబంధన లేనందున ఉపాధ్యాయల పదోన్నతుల్లో కూడా టెట్‌ నిబం ధన వర్తింపకుండా చట్టంలో ఉన్న మినహాయింపులను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అభ్యర్థనతో ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు పదోన్నతిలో టెట్‌ అర్హ త మినహాయింపుకు అనుమతి తీసుకోవాలి.లేదా టెట్‌ రాయడానికి అర్హత కూడా 44 సంవత్స రాలే కాబట్టి ప్రభుత్వం ఇన్‌ సర్వీస్‌లో ఉండి 45 సం”రాలు దాటిన ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి. లేదా పదో న్నతుల ప్రక్రియను కొనసాగిస్తూ 3 సం వత్సరాల్లో అర్హత సాధించాలనే నిబం ధన మేరకు పదోన్నతులు చేపట్టా లి. ప్రభుత్వం ఏదో ఒక పరిష్కా రం ద్వారా ఇటు ఉపాధ్యా యులకు, అటు నిరుద్యో గులకు న్యాయం చేయాలి.
– జుర్రు నారాయణ యాదవ్‌
9494019270