వైకుంఠవ్రతాన్ని ప్రారంభించిన సర్పంచ్ శ్రీనివాస్

– దాతల సహకారంతోనే వైకుంఠ రథం ఏర్పాటు
నవతెలంగాణ – మిరు దొడ్డి 
అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామానికి చెందిన మాదాసు నగేష్ అనే ఇద్దరు సోదరులు తమ తండ్రిగారైన రాజయ్య, తాతగారైన లక్ష్మీనారాయణల జ్ఞాపకార్థం రూ. 80 వేలు, సర్పంచి శ్రీనివాస్ రూ 50 వేల తో గ్రామానికి  వైకుంఠ రథాన్ని అందజేశారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం వైకుంఠ రథాన్ని గ్రామానికి అందజేసినందుకు  గ్రామస్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాస్ నరేష్ రంజిత్ రవి ఎల్లారెడ్డి చంద్రం రమేష్ నర్సింహారెడ్డి బాల్రెడ్డి లింగం మహేందర్ రెడ్డి తోపాటు తదితరులు పాల్గొన్నారు.