నవతెలంగాణ – జక్రాన్ పల్లి
కాంగ్రెస్ పార్టీ రానున్న 15 సంవత్సరంలో అధికారంలో ఉండడం ఖాయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సోమవారం అన్నారు. జక్రాన్పల్లి మండలంలోని కలిగోట్ గ్రామంలో పుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి 101 కొబ్బరికాయలు కొట్టి మోక్కు తీర్చుకున్నారు. అనంతరం కలిగోట గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులు ఉద్దేశించి గ్రామ సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఉంటుందని అన్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను విడుతలవారీగా అన్ని పరిష్కరిస్తాం. కాంగ్రెస్ అభయ హస్తం ద్వారా అప్లై చేసుకున్న లబ్ధిదారులకు పథకాలు అందే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఐదు సంవత్సరాలు ప్రజలకు మా ప్రభుత్వం జవాబుదారీగా ఉంటామని అన్నారు.కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు అధికారంలో ఉండడం ఖాయం అని చెప్పారు. ఈ గ్రామం ఎలక్షన్లో 340 లీడ్ ఓటింగ్ ఇచ్చిందని అని అన్నారు. ప్రజల అందరివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని. ఏ పథకమైన అర్హులైన ప్రజలందరికీ వర్తించేలా కృషి చేస్తానని అన్నారు. కలిగోట్ గ్రామంలో డ్రైనేజ్ గ్రామం నుండి వాగు వరకు ప్రపోజల్ పెడతానని అన్నారు. గ్రామంలో సిసి రోడ్స్, కి 15 లక్షల రూపాయలు తొందర్లో ఇచ్చే ప్రయత్నం చేస్తానని అన్నారు. గ్రామంలో ఉన్న హైస్కూల్లో 3 ఉపాధ్యాయుల కొరత ఉందని వీడీసీ తెలియజేయగా ఎమ్మెల్యే స్పందించి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ పడబోతుంది అందులోంచి 3 ఉపాధ్యాయులని కలిగోట గ్రామ హైస్కూల్ కి ఆరెంజ్ చేస్తామని అన్నారు. కలిగుట గ్రామానికి బస్సు సదుపాయం కూడా కల్పిస్తామని అన్నారు. జక్రంపల్లి మండలంలో 133 కె.వి సబ్ స్టేషన్ కి ప్రపోజల్ పెడతామని అన్నారు. శివాలయంలో కళ్యాణమండపం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. మండలంలో పలు గ్రామాలలో వీడిసి సభ్యుల మీద కేసులు కొట్టేసే విధంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. అభివృద్ధి పథకాలకు పాల్పడుతానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి తో మాజీ ఎంపీపీ అనంత్ రెడ్డి, అప్పల రాజన్న,గ్రామ సర్పంచ్ చేతన విజయ్ రెడ్డి, ఉపసర్పంచ్ నాయక రాజు, ఎంపిటిసి జయగిరిధర్ గౌడ్, సీనియర్ నాయకుడు శేఖర్ , మండల వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, మండల యూత్ అధ్యక్షుడు సొప్పరి వినోద్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాధర్, కిసాన్ కేత్ అధ్యక్షులు బాలయ్య, విడిసి అధ్యక్షులు తిరుపతి, అర్గుల్ ఎంపిటిసి వనిత,పాటు ఆయా గ్రామాల సర్పంచులు మాజీ సర్పంచ్లు కార్యకర్తలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.