
మండలంలోని తాడిచెర్ల, అడ్వాలపల్లి నూతన గ్రామపంచాయతీ భవనాలను సోమవారం మండల ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు ప్రారంభించారు. రూ.20లక్షల ఈజిస్ నిధులతో నిర్మాణం చేసిన తాడిచెర్ల భవనం, రూ.24 లక్షల ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో నిర్మాణం చేపట్టిన అడ్వాలపల్లి నూతన భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కోమల, సర్పంచ్ లు సుంకరి సత్తయ్య, రాజు నాయక్, పంచాయతీ కార్యదర్సులు శేఖర్,సునీత, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, సింగిల్ విండో చైర్మన్ రామారావు, డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య,సంగ్గెం రమేష్, వొన్న తిరుపతి రావు,ఉప సర్పంచ్ చెంద్రయ్య, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.