టీపీటీఎఫ్ రాష్ట్ర  విద్యా వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయండి

నవతెలంగాణ – మిరు దొడ్డి 
అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని భూంపల్లి ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ద్వితీయ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక  మహాసభల గోడపత్రికను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా టీపీటీఎఫ్ అక్బర్ పేట భూంపల్లి మండల ప్రధాన కార్యదర్శి పి.సతీష్ కుమార్ రెడ్డి ,టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శులు ఆర్ మల్లేశం, జి.శివాజి గార్లు మాట్లాడుతూ ఫిబ్రవరి 11, 12 తేదీలలో ఖమ్మంలో జరుగు ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహాసభలకు ఉపాధ్యాయులు, మేధావులు,అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 317 జీవో వల్ల స్థానికత కోల్పోయిన టీచర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేజీబీవీ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యా వైజ్ఞానిక మహాసభలకు విరాళం అందించిన బక్కి వెంకటయ్య గారికి కృత్ఞతలు తెలియజేశారు.
 “అంతరాలు లేని విద్య ప్రజల హక్కు ప్రభుత్వ బాధ్యత”ప్రధాన అంశంగా ఈ విద్యా వైజ్ఞానిక మహాసభలు నిర్వహిస్తున్నామని , అసమాన సమాజంలో సమానత్వ విద్య,  మహిళల స్థితిగతులు కర్తవ్యాలు, ప్రభుత్వ విధానాలు ఆర్థిక సంక్షోభం అను అంశాలపై ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ సి కాశీం ,బుర్ర రమేష్ ,ఏ నరసింహారెడ్డి, చందన చక్రవర్తి,ఎన్.వేణుగోపాల్ తదితరులు ప్రసంగించనున్నారు,ముఖ్య అతిథులుగా  ఉపముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ధనసరి సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు గార్లు హాజరుకానున్నారు.  ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భూంపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బి.రాజేందర్ గారు,టీపీటీఎఫ్ జిల్లా కౌన్సిలర్స్  ఎ.రాంచంద్రం, సి.హెచ్ నాగరాజు , మండల ఉపాధ్యక్షులు బి.శ్రీనివాస్ , నాయకులు రవిశంకర్ ,దయాసాగర్ , వినయ్ కుమార్, ఉపాధ్యాయులు భాగ్యమ్మ, పద్మావతి , వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.