
అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మిరుదొడ్డి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారని యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు. వరల్డ్ నకయమా షోటోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని సరూర్నగర్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో రెండవ అంతర్జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. కరాటే పోటీలకు ఇండియా, బుటన్, శ్రీలంక, ఆఫ్గనిస్తాన్, నేపాల్ బంగ్లాదేశ్ తో పాటు సుమారు 30 దేశాలకు చెందిన 3000 మంది పాల్గొన్నట్టు తెలిపారు. కరాటే పోటీల్లో మిరుదొడ్డి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన 17మంది విద్యార్థులు 8 గోల్డ్ మెడల్స్,9 సిల్వర్ మెడల్స్, సాధించారని మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపాడు. గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులు గోల్డ్ మెడల్స్ హరిని, భవాని, హరిత, హశ్విత,కావ్య సిల్వర్ మెడల్స్ శ్రావణి, ప్రత్యూష,అక్షయ,ప్రసన్నలక్ష్మి, సంజన, రవళి, దీక్షిత, ఆకాంక్ష, రమ్య ,దివ్య సాధించారు అని మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపాడు పథకాలు సాధించిన విద్యార్థులను డీఈవో శ్రీనివాస్ రెడ్డి, జి ఈ సి ఓ ముక్తేశ్వరి మాస్టర్ బురాని శ్రీకాంత్, సురేందర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎస్ ఓ స్వర్ణలత , పిఈటి భాగ్యమ్మ పాఠశాల సిబ్బంది అభినందించారు.