
మండలంలోని మల్లారం గ్రామంలో ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రాన్ని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేస్ మిశ్రా ఆదేశాల మేరకు సోమవారం మండల ఎంపీడీఓ నరసింహమూర్తి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోజువారీ సిబ్బంది హాజరు రిజిస్టర్,మందులు,ఉప కేంద్రంలో మౌలిక వసతులపై అరా తీశారు.వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.