రెంజల్ గ్రామపంచాయతీ వీడ్కోలు అభినందన సభ

నవతెలంగాణ – రెంజల్

మండల కేంద్రమైన రెంజల్ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులకు సోమవారం ఘనంగా సన్మానం జరిపారు. వీడ్కోలు అభినందన సభలో భాగంగా సర్పంచ్ లా ఫోరం మండల అధ్యక్షులు మరల షికారి రమేష్ కుమార్ పాలకవర్గ సభ్యుల వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పిటిసి మేక విజయ సంతోష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పాలకవర్గ సభ్యులకు సత్కరించడం కాకుండా మెమొంట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అన్నం గంగామణి, పాలకవర్గ సభ్యులు గంగవ్వ, నాగమణి, మల్లెల రాణి, సగ్గు వెంకటి, ఈర్ల రంజిత్ కుమార్, గంగారెడ్డి, లసిం గారి రేఖ, జహీదా, ఇర్ఫాన, ఎండి సిరాజుద్దీన్, మంగల్ పాడు లక్ష్మణ్, సయ్యద్ సమీ, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, సూపరిండెంట్ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి రాఘవేంద్రరావు, స్థానిక ప్రజాప్రతినిధులు కిషోర్, మేక సంతోష్, కోఆప్షన్ సభ్యులు పోశెట్టి ,ఆర్మూర్ లడ్డు తదితరులు పాల్గొన్నారు