– మాజీ ఎమ్మెల్యే రసమయి వాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణుల ధ్వజం
– ఎమ్మెల్యే కవ్వంపల్లిపై వాఖ్యలు చేస్తే సహించేదిలేదని హెచ్చరిక
నవతెలంగాణ – బెజ్జంకి
అధికార దుర్వినియోగానికి పాల్పడి అభివృద్ధి పేరునా అందినకాడికి దోపిడి చేసి బీనామీల పేరుతో అక్రమ ఆస్తులు కూడగట్టుకున్న చరిత్ర మానకొండూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దేనని..బీఆర్ఎస్ ప్రభుత్వమంటేనే దోపిడికి నిదర్శమని మండల కాంగ్రెస్ శ్రేణులు ధ్వజమెత్తారు.సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన అనుచిత వాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు ఖండించారు.ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి మాట్లాడారు.అధికార దుర్వినియోగంతో నియోజకవర్గంలోని ప్రతి అభివృద్ధి నిర్మాణ పనుల్లో నాణ్యతలేకుండా చేపట్టి ప్రజా ధనాన్ని దోపిడి మాజీ ఎమ్మెల్యే చేశాడన్నారు.ప్రభుత్వ చేపట్టిన అభివృద్ధి పనుల్లో లోపాలను ఎత్తిచూపి ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయించిన ఘనుడు మాజీ ఎమ్మెల్యే బాలకిషనేనని..ఇకనుండి ఎమ్మెల్యే కవ్వంపల్లిపై మాజీ ఎమ్మెల్యే బాలకిషన్,బీఆర్ఎస్ శ్రేణులు అనుచిత వాఖ్యలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు.ప్రజా సమస్యల పరిష్కారానికి సూచనలు,సలహాలు చేస్తే సహృదయంతో స్వీకరిస్తామన్నారు.రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,నాయకులు అక్కరవేణి పోచయ్య, శానగొండ శ్రావణ్,మంకాల ప్రవీన్,మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,కత్తి రమేశ్ తదితరులు హజరయ్యారు.