బదిలీపై వెళ్లడం భాధాకరం అయినా తప్పదు : ఎంపీపీ

 నవతెలంగాణ – రామారెడ్డి
పనిచేసే చోటును, కలిసి పనిచేసిన వారి విడిచి బదిలీపై వెళ్లడం ఉద్యోగులకు బాధాకరమైన, ఉద్యోగరీత్యా బదిలీపై వెళ్లడం తప్పదని, వెళ్లిన ప్రతి చోట విద్యార్థులకు విద్యాబోధన నేర్పించి ఉన్నత స్థానాల్లో స్థిరపడేలా సూచించాలని స్థానిక ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి సోమవారం అన్నారు. మండలంలోని స్కూల్ తాండ ప్రభుత్వ పాఠశాల నుండి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు సామల శ్రీనివాస్, జంపాల లక్ష్మీరాజం, నరేష్లను పలువురు శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సలావత్ లలితా బుచ్చిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజేష్, ఉపాధ్యాయులు, తాండవాసులు తదితరులు పాల్గొన్నారు.