– పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-కంటేశ్వర్ : పెట్టుబడిదారీ వ్యవస్థకు విరుగుడు సోషలిస్టు వ్యవస్థ అని నిరూపించిన వ్యక్తి లెనిన్ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరద సభ్యులు పాలడుగు భాస్కర్ అన్నారు. ఈ మేరకు సోమవారం సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో లెనిన్ శత వర్ధంతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సెమినార్లో కమ్యూనిజం నేటి సమకాలీన పరిస్థితులు అనే అంశం పైన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. వివిధ దశలలో మారుతూ పెట్టుబడిదారీ వ్యవస్థకు రూపాంతరం చెందిన తర్వాత సమాజాభివృద్ధికి పెట్టుబడిదారీ వ్యవస్థ కారణమని పెట్టుబడిదారులు ప్రచారం చేస్తున్న సందర్భంలో పెట్టుబడుతారు వ్యవస్థలో ప్రజలు తీవ్రమైనటువంటి దోపిడీకి వివక్షతకు గురవుతారని దోపిడీ లేని సమసమాజ నిర్మాణం ద్వారా మాత్రమే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని సిద్ధాంత రూపొందించిన మార్క్స్ దాన్ని అనుసరించటానికి లెనిన్ రష్యాలో సోషలిస్టు వ్యవస్థను నిర్మించి కమ్యూనిజం ద్వారా మాత్రమే ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారని వ్యత్యాసాలు తారతమ్యాలు లేని సమ సమాజం ఏర్పడుతుందని వివక్షత అంటరానితనం కులము మతము అనే బేధాలు లేకుండా ధనికుడు పేదవాడు అనే వర్గ విభేదాలు లేకుండా అందరూ సమానంగా జీవించే పరిస్థితులు వస్తాయని నిరూపించారని అటువంటి సమాజం నిర్మాణం కోసం దోపిడీ లేని వివక్షత లేని అసమానతలు లేని సమాజం కోసం పాటుపడాల్సిన అవసరం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకత ఉందని భారతదేశంలో కుల మతాల పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం పాలకులు ప్రయత్నిస్తున్నారని వీటిని తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట రాములు, నూర్జహాన్, వెంకటేష్, శంకర్ గౌడ్, మండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్, జిల్లా కార్యదర్శి సిరుపలింగం, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వై గంగాధర్ నన్నే సాబ్, సుజాత, కొండగంగాధర్, పెద్ది సూరి, అనిల్ తదితరులతోపాటు నగర కమిటీ సభ్యులు కటారి రాములు, డి కృష్ణ, హైమద్, తదితరులు పాల్గొన్నారు.