యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా ‘హ్యాపీ ఎండింగ్’. అపూర్వ రావ్ హీరోయిన్. హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజరు రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ పల్లాల మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ సినిమా యూత్ నచ్చేలా ఉంటూనే మెసేజ్ ఓరియెంటెడ్‌గా నిర్మించాం. ఈ కథలో పొటెన్షియాలిటీ ఉంది. ‘వికీ డోనర్, ఓ మై గాడ్ 2′ సినిమాల్లో మనం ఇబ్బంది అనుకునే అంశాన్ని ప్రధానంగా చూపించినా… కథలో అనేక ఎలిమెంట్స్ కీలకంగా ఉంటాయి. ఈ కథలోనూ అలాంటి లేయర్స్, ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ మూవీ చూసిన తర్వాత ఒక ఆలోచనలో పడతారు. యష్, అపూర్వ ఇద్దరూ థియేటర్ నుంచి వచ్చిన నటులు. వీరి నటన ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు స్మైల్‌తో వస్తారు. మీ టైమ్ వథా కాలేదని అనుకుంటారు. ఏషియన్ వాళ్ల ద్వారా మా మూవీని రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది’ అని అన్నారు.