2 నిమిషాలు మౌనం పాటించిన పోలీసులు

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనివార్, ఐ.పి.యస్, ఆదేశానుసారంగా మంగళవారం పోలీస్ పరేడ్ గ్రాండ్లో ఉదయం 11 గంటల సమయంలో అదనపు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్  ఎస్. జయ్ రామ్ ఆద్వర్యంలో 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు డిప్యూటి కమీషనర్ జయ్ రామ్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం మహనీయులు తమ అమూల్యమైన ప్రాణాలను సైతం పనంగా పెట్టి, పొరాడి, ప్రాణ త్యాగం చేసి, అసవులు బాసిన అమరవీరుల జ్ఞాపకార్ధం కోసం స్మరించుకొనుటకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు వారికి 2 నిమిషాల మౌనం పాటించడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రొబేషనరి ఐ.పి.ఎస్., బి. చైతన్య రెడ్డి పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డా॥సరళ, ఆఫీస్ సూపరింటెండెంటులు, పోలీస్ కార్యాలయం సిబ్బంది,సీ.సీ.ఆర్.బి సిబ్బంది హాజరయ్యారు.