పిల్లల చదువులపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి

– కల్తీ శ్రీనివాస్,  ప్రధానోపాధ్యాయులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
పిల్లల చదువులపై తల్లిదండ్రులు దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్తీ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కర్లపల్లి ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల లో విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడారు.పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి 10/10 రిజల్ట్స్ పై విద్యార్థుల తల్లిదండ్రులతో కర్లపల్లి ఉపాద్యాయులు చర్చించారు. మంచి మార్కులు రావాలంటే ఉత్తమ మైన క్రమశిక్షణతో కూడిన విద్య అవసరం అని,రాష్ట్రప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ విద్యార్థులకోసం ఎంతో వినూత్న కార్యక్రమాలు చేస్తుందని 100 రోజుల ప్రోగ్రాం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని రోజువారీ టెస్టుల ద్వారా మంచి మార్కులు రావడానికి వీలవుతుందని తెలిపారు మన పాఠశాల లో ఎంతో అనుభవం ఉన్న ఉపాధ్యాయులు అద్భుతమైన బోధన అందిస్తున్నారు అని తెలిపారు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గాలనే ఉద్దేశంతో పాఠశాల లో రోజు సూపర్ విసన్ డ్యూటీస్,సెలవులో టర్మ్ డ్యూటీస్ ద్వారా ఉపాద్యాయులు విద్యార్థులకు అందుబాటులో ఉంటున్నారు అలాగే రోజు అదనపు క్లాసుల ద్వారా బోధించడం జరుగుతుందని దానిని సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి మార్కుల తో ఉత్తిర్ణత కావాలని పాఠశాల కు మంచిపేరు తేవాలని కోరారు విద్యార్థులు సైతం తమ గురువులకు,పాఠశాల కు,అలాగే మమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రుల కోరికను నెరవేరుస్తూ మంచి మార్కులతో పాస్ అవుతామని  హామీ ఇచ్చారు తదుపరి 10వ తరగతి క్లాస్ ఫస్ట్ వచ్చిన పూర్వ విద్యార్థికి రాములు  5వేల రూపాయలు ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా ఉపాద్యాయుల,పేరెంట్స్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈకార్యక్రమంలో ఉపాద్యాయులు ,విద్యార్థులు,మరియు పేరెంట్స్ పాల్గొన్నారు.