ప్రభుత్వోన్నత పాఠశాలలో ఆర్ఓ త్రాగునీరు ప్రారంభం 

నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని తోటపల్లి ప్రభుత్వోన్నత పాఠశాలలో జ్యోతిష్మతి విద్యాసంస్థల అధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆర్ఓ త్రాగునీరును సర్పంచ్ బోయినిపల్లి నర్సింగ రావు మంగళవారం ప్రారంభించారు. విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగు నీరందిచాలనే జ్యోతిష్మతి విద్యాసంస్థల సంకల్పం గొప్పదని సర్పంచ్ నర్సింగ రావు కొనియాడారు. పాఠశాల బోధన సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.