నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రముఖ స్వతంత్ర సమరయోధులు,ఉప్పు సత్యాగ్రహం ఉద్యమ కర్త,కాంగ్రెస్ కు పట్టుకొమ్మ లాంటి మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ ని ప్రస్తుతం రాష్ట్రం లో అధికారం లో జాతీయ కాంగ్రెస్ స్థానిక నాయకులు మరిచారు.ఈ నియోజక వర్గం లో సైతం కాంగ్రెస్ అత్యధికఆధిక్యం తో విజయం సాధించింది.కానీ అదే కాంగ్రెస్ కు దిక్చూచి లాంటి మహనీయుడి వర్ధంతిని కూడా స్థానిక నేతలు మరిచిపోవడం విచారం అని పార్టీకి చెందిన సాధారణ అభిమానులు,కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వాస్తవానికి అధికారంలో ఉన్న నేపధ్యంలో ఆ పార్టీ విధానాలను పార్టీ పూర్వ నాయకుల జయంతి,వర్ధంతి లు నిర్వహణ ద్వారా పార్టీ ప్రతిష్టను పెంపొందించు కోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.గాంధీ వర్ధంతి నాడు ఆయన మొహం కూడా ఏ నాయకు చూడకపోవడం విమర్శలు వస్తున్నాయి.పదవుల కోసం పోటీ పడే నాయకులు ఆ పార్టీ వారసత్వ నేతలను మెరవడం పై సర్వత్రా నిరసనలు వెలువడుతున్నాయి.